Home Maharashtra Drone camera | పెళ్లికొడుకుపై కత్తితో దాడి..నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా

Drone camera | పెళ్లికొడుకుపై కత్తితో దాడి..నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా

0
Drone camera tracks and helps capture the suspect who attacked the wedding groom in Amravati.

Drone camera Chase:మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి  జారుతున్న  సమయంలో ఘోరమైన  ఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించాడు. ఈ దాడి పెళ్లి వేడుకలో పాల్గొన్న వారిని భయాందోళనలకు గురిచేసింది.

సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో డీజే డాన్స్ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది.

దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు

దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. అయితే, అక్కడి ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా స్పందించి తన డ్రోన్ కెమెరా(Drone Camera) సహాయంతో నిందితుడిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంబడించాడు.

ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పెళ్లికొడుకును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version