Home National IPL Auction 2026 | ఐపీఎల్ చరిత్ర లో అత్యంత ఖరీదైన ప్లేయర్…జాక్ పోటీ కొట్టింది...

IPL Auction 2026 | ఐపీఎల్ చరిత్ర లో అత్యంత ఖరీదైన ప్లేయర్…జాక్ పోటీ కొట్టింది ఎవరంటే?

0
Franchises participate in intense bidding during IPL Auction 2026
Franchises participate in intense bidding during IPL Auction 2026

IPL Auction 2026లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అబుదాబిలో జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green)ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది.

2024లో మిచెల్ స్టార్క్‌కు దక్కిన రూ.24.75 కోట్ల రికార్డును గ్రీన్ అధిగమించాడు.

ALSO READ:Delhi Air Pollution | వాయు కాలుష్య నివారణలో భారత్‌కు చైనా మద్దతు

ఇక అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో వేలం మరింత ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చి, ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అతడి ధర రూ.13 కోట్లను దాటింది. ఇది ఐపీఎల్ వేలం చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.

మరోవైపు అంతగా పరిచయం లేని ఆటగాళ్లు కూడా సంచలనాలు సృష్టించారు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆకిబ్ నబీ ఏకంగా రూ.8.40 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టిని ఆకర్షించాడు.

స్టార్ ఆటగాళ్లకే కాకుండా కొత్త ప్రతిభకు కూడా ఐపీఎల్ వేదికగా మారుతోందని ఈ వేలం మరోసారి నిరూపించింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version