Home Telangana Kamareddy హిందూ దేవుళ్ల అవమానం… మహాదేవ్ స్వామీజీ కీలక వ్యాఖ్యలు…

హిందూ దేవుళ్ల అవమానం… మహాదేవ్ స్వామీజీ కీలక వ్యాఖ్యలు…

0
కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వామీజీ మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్ 'లింగమర్మం'లో శివుణ్ణి అవమానించే సన్నివేశాలను వ్యతిరేకించారు. ధ్యాన మందిరం ప్రకటించిన సూత్రాలు హిందూ మనోభావాలను దెబ్బతీస్తాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

స్వామీజీ మాట్లాడుతూ, బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఉద్బవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందని చెప్పారు.

మూడేళ్ల క్రితం తీసిన షార్ట్ ఫిల్మ్ ‘లింగమర్మం’ లో శివుణ్ణి అవమానించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు.

శివలింగాన్ని అవమానించడం తప్పు అని, తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదని అన్నారు.

ఈ షార్ట్ ఫిల్మ్ శివ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుంది అని అన్నారు.ఇతర మతాలను ప్రచారం చేయడం తప్పు కాదని, కానీ దాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదు అని చెప్పారు.

ఇటీవల హిందూ దేవుళ్ల అవమానించడం పరిపాటిగా మారిందని, దీన్ని నిరోధించేందుకు యావత్ హిందువులంతా ఏకమై ఉండాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ లోని పిరమిడ్ ధ్యాన మందిరం ప్రకటించిన 18 సూత్రాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version