Vijayasai Reddy | కులం, మతం కాదు.. అందరి కోసం కొత్త పార్టీ: విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు విజయసాయి రెడ్డి శ్రీకారం చుట్టనున్నారా? మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై వరుస ప్రకటనలు చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ విధానం, రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో పరిమితం కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాలు, అన్ని మతాలను కలుపుకుని ముందుకు సాగడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ఒక స్థానంలో, వైసీపీ రెండో స్థానంలో ఉంటే తాము ఏర్పాటు చేయబోయే పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో పలువురు నాయకులూ కుల రాజకీయాలను చేస్తూ రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. తాను హిందువునని, అయితే చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా ప్రార్థిస్తానని చెప్పారు. ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు వెళ్లే తాను, అదే విధమైన పరస్పర గౌరవం అన్ని వర్గాల నుంచి ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, రాష్ట్ర భవిష్యత్‌పై తన ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నట్లు విజయసాయి రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ కొత్త రాజకీయ వేదిక భవిష్యత్తులో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది పార్టీ అధికారికంగా ఏర్పడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related posts

Deputy cm Pawan Kalyan | పులి కదలికలపై హైటెక్ నిఘా.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

CM Chandrababu Naidu | మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Beggar Donates Lakhs | భిక్షాటన చేస్తూ లక్షల విరాళాలు.. నర్సియమ్మ గొప్ప మనసుకు జేజేలు

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More