Vijay Divorce | విజయ్‌పై సంగీత మరో పిటిషన్

0
Thalapathy Vijay with wife Sangeetha divorce petition news

Vijay Divorce: ప్రముఖ తమిళ నటుడు మరియు “తమిళగ వెట్రి కళగం” అధినేత “విజయ్” కు మరో వివాదం తలెత్తింది. ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కొత్త పిటిషన్‌ను సమర్పించారు.

విడాకుల కేసు పూర్తి అయ్యే వరకు “చెన్నై, నీలంకరైలోని వారి సొంత నివాసంలోనే ఉండేందుకు” అనుమతి కోరుతూ, విజయ్ తరుపు ఆమెను ఇంటిని ఖాళీ చేయమని హెచ్చరించిందని పేర్కొన్నారు.

సంగీత “బ్రిటిష్ పౌరసత్వం” కలిగిన మహిళగా, చెన్నైలో ప్రత్యామ్నాయ నివాసం లేకపోవడంతో, “తన పిల్లలతో కలిసి ఆ ఇంట్లో నివసించే హక్కు” ఉంది అని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఆమె ఆరోపణల ప్రకారం, విజయ్‌కు ఒక ప్రముఖ నటితో ఉన్న సంబంధం ఈ వివాదానికి కారణమై, 2021 నుండి ఆమెకు తీవ్రమైన మానసిక వేదనలు కలిగిస్తున్నాయి.

వీటితో పాటుగా, విడాకుల సెటిల్‌మెంట్‌లో భారీ “భరణా డిమాండ్” కూడా చేస్తారని సమాచారం. ఈ వ్యక్తిగత వివాదం “విజయ్ రాజకీయంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధమవుతున్న” సమయంలో మరింత ప్రాధాన్యత సంతరించింది.

కోర్టు ఈ పిటిషన్‌పై స్పందిస్తూ “విజయ్‌కు నోటీసులు జారీ చేసి”, తదుపరి విచారణను “2026 ఏప్రిల్ 20″కి వాయిదా వేసింది.

NO COMMENTS

Exit mobile version