Home InterNational WHO Exit: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బయటకు వచ్చిన అమెరికా.. కారణాలు ఇవే

WHO Exit: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బయటకు వచ్చిన అమెరికా.. కారణాలు ఇవే

0
us exits world health organization over covid failures
us exits world health organization over covid failures

WHO Exit: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా నిష్క్రమించినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. చైనాలోని వూహాన్‌లో ప్రారంభమైన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించడంలో WHO పూర్తిగా విఫలమైందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి సమయంలో అవసరమైన అత్యవసర చర్యలను WHO సకాలంలో చేపట్టలేదని, కొన్ని దేశాల రాజకీయ ప్రభావాలకు లోనై స్వతంత్రంగా వ్యవహరించలేకపోయిందని అమెరికా ఆరోపించింది.

ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే జారీ చేసిన 14155 నంబర్ కార్యనిర్వాహక ఆదేశం అమలులో భాగంగానే WHO నుంచి నిష్క్రమించామని అమెరికా తెలిపింది. WHO చర్యలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

WHO వ్యవస్థాపక దేశాల్లో అమెరికా ఒకటని, ఏటా భారీగా నిధులు అందించినప్పటికీ సంస్థ తన ప్రాథమిక లక్ష్యాల నుంచి దారి తప్పిందని విమర్శించింది. కరోనా సమయంలో సరైన సమాచారం అందించి ఉంటే ఎంతోమంది అమెరికన్ల ప్రాణాలు కాపాడగలిగేవామని అభిప్రాయపడింది.

అమెరికా ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యానే WHO నుంచి వైదొలిగామని ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై ప్రజారోగ్య రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని అమెరికానే చేపడుతుందని, విశ్వసనీయ భాగస్వామ్యాలతో ముందుకెళ్తామని స్పష్టం చేసింది.

also read:Top 4 Unbreakable Records in ODI Cricket | వన్డే ఇంటర్నేషనల్స్‌లో బ్రేక్ కాని 4 రికార్డులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version