T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026″ ఫిబ్రవరి 7 నుండి “భారత్-శ్రీలంక”(IND VS SRILANKA) వేదికగా ప్రారంభం కానుంది. అయితే భద్రత కారణాలను చూపిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేదు. తమ మ్యాచ్‌లను శ్రీలంక కి మార్చమని “ICC”పై ఒత్తిడి చేసినప్పటికీ, భారత్‌లో భద్రత సమస్యలు లేవని ICC అంగీకరించలేదు.
ఫలితంగా బంగ్లాదేశ్ మెగా టోర్నీ నుంచి తప్పుకుందనే పరిణామం ఏర్పడింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ICC టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక అయ్యింది. పాకిస్థాన్ మొదట వరల్డ్‌కప్‌ను బహిష్కరించాలనుకున్నప్పటికీ,తర్వాత వెనక్కి తగ్గి టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక”కి చేరుతోంది.
ఈ పరిణామాలపై “టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా”(Suresh Raina) మాట్లాడుతూ
“ఇది బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధం. భారత్‌లో భద్రత సమస్యలు లేవు. ఆ జట్టు రాకపోవడం వల్ల వారు కోల్పోతున్నారు. ఆ టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది.
భారత పిచ్‌లపై స్పిన్నర్లు బాగా నేరుగా Advantage పొందతారు,” అని రైనా తెలిపారు. అలాగే ICC చైర్మన్ జైషా వ్యాఖ్యల గురించి: “వరల్డ్‌కప్ ఆడేందుకు భారత్‌కి రాకపోతే కఠిన చర్యలు తీస్తామని, క్రికెట్ బోర్డులు భారీ నష్టానికి గురవుతాయని” రైనా తెలిపాడు.
also read:ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఫోన్ కావాలా? రియల్‌మీ పీ4 పవర్ ఇదే సమాధానం
