Pawan Kalyan: భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు గన్నవరం విమానాశ్రయంలో జనసేన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అభిమానుల అభివాదాలను స్వీకరించిన ఆయన అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో అధికారులతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, శాఖల పనితీరు, పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు రానున్న రాజకీయ కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాష్ట్రానికి రావడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ALSO READ: Brave Boy | “కమీషన్ ఇస్తేనే పని అవుతుందా?”.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు అధికారులు షాక్!