IPL 2026:ఎం ఎస్ ధోని(MS DHONI) ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడనున్నాడు. జూలైలో 45 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో ధోనీ పూర్తి సీజన్ ఆడతాడా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సీఎస్‌కే(CSK) మేనేజ్‌మెంట్ ఆయన ఈ సీజన్‌కు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసినప్పటికీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలిపింది. అన్ని మ్యాచ్‌లు ఆడే విషయంపై తుది నిర్ణయం టోర్నమెంట్ సమయంలో పరిస్థితులను బట్టి తీసుకుంటామని పేర్కొంది.
స్క్వాడ్‌లోకి వచ్చిన సంజు శాంసన్ వల్ల వికెట్‌కీపింగ్ విభాగంలో సీఎస్‌కేకు బలమైన ప్రత్యామ్నాయం లభించింది. ధోనీకి విశ్రాంతి ఇచ్చే మ్యాచ్‌ల్లో సంజూ గ్లౌజులు ధరించే అవకాశం ఉంది.
అలాగే ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ కూడా వికెట్‌కీపింగ్ ఆప్షన్లుగా ఉన్నారు. ముఖ్యంగా కార్తిక్ శర్మను భవిష్యత్తు ఫినిషర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో జట్టు ఉంది.
గత సీజన్‌ల మాదిరిగానే ధోనీని ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. చివరి ఓవర్లలో ఫినిషర్ పాత్రలో జట్టుకు కీలకంగా మారవచ్చు. ఫిట్‌నెస్ దృష్ట్యా బ్యాటింగ్‌ను కొద్ది ఓవర్లకే పరిమితం చేసే అవకాశముంది.
M. A. Chidambaram Stadium (చెపాక్)తో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. హోమ్ మ్యాచ్‌ల్లో తప్పకుండా ఆడేందుకు ప్రయత్నిస్తాడనే ప్రచారం ఉంది. మైదానంలోకి అడుగుపెట్టగానే ‘ధోనీ.. ధోనీ’ నినాదాలతో చెపాక్ మార్మోగడం సహజం.
ఐపీఎల్ చరిత్రలో 278 మ్యాచ్‌లు ఆడి, 5439 పరుగులు సాధించి, సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ మరో సీజన్‌కు సిద్ధమవుతున్నాడు.
ALSO READ:Gold Silver price today | ఒక్కరోజులో భారీ పతనం.. వెండి మార్కెట్‌లో సంచలనం
