Konaseema Gas Blowout | బురద పంపింగ్‌తో అదుపులోకి గ్యాస్ లీక్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Konaseema Gas Blowout ONGC Gas Leakage

Konaseema Gas Blowout: కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా చోటుచేసుకున్న గ్యాస్ బ్లోఅవుట్ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. తెల్లవారుజామున గ్యాస్ బావి నుంచి లీకేజీ ప్రారంభం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి చివరకు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ సమీపంలోని ఓఎన్‌జీసీ గ్యాస్ బావి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ప్రారంభమైనట్లు సమాచారం అందిందని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వెల్లడించింది. బావి వద్ద మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఈ బ్లోఅవుట్ సంభవించినట్లు సంస్థ పేర్కొంది.

సమాచారం అందిన వెంటనే ఓఎన్‌జీసీ అధికారులు స్పందించి రాజమండ్రి విపత్తు నిర్వహణ బృందాన్ని రంగంలోకి దించారు. ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ ప్రవాహాన్ని నియంత్రించేందుకు భద్రతా చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్తగా బావి చుట్టూ 500 మీటర్ల పరిధిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్యాస్ లీకేజీ ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాతీయ రహదారి 216పై వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ప్రమాద నివారణలో భాగంగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు వాటర్ బ్లాంకెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను కొనసాగించినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది.

లీకేజీకి అడ్డుకట్ట.. అధికారులకు ఊరట!

బురదను పంపింగ్ చేసి షియర్ ర్యామ్ ఏర్పాటు చేయడం ద్వారా గ్యాస్ ప్రవాహాన్ని క్రమంగా నియంత్రణలోకి తీసుకొచ్చారు. దీంతో గ్యాస్ బ్లోఅవుట్ అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ముందస్తు భద్రతా చర్యలు, అధికారుల సమన్వయంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు.

Related posts

Vande Bharat Express | ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖ నుంచి తిరుపతికి మరో వందేభారత్

Akvan Cyclone | ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన పెను తుఫాన్ ముప్పు

Cyclone Aquan | తీర ప్రాంతాలకు భారీ హెచ్చరిక.. అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More