జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి”నవీన్ యాదవ్” మాట్లాడుతూ, తమ కుటుంబం ఈ ప్రాంత ప్రజలతో గత 40 ఏళ్లుగా గాఢమైన అనుబంధం కలిగి ఉందని తెలిపారు.
సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని, అందుకే ప్రజలు తనను సెక్యులర్ నాయకుడిగా భావిస్తున్నారని చెప్పారు.
2014లో MIM తరఫున పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు తనను విశ్వసించి రెండో స్థానంలో నిలిపారని గుర్తుచేశారు.
Also Read:Kurnool:కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన -ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డను వదిలేసిన తల్లి
బీజేపీ నేత బండి సంజయ్ తనను “నవీన్ ఖాన్” అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇక్కడ అభివృద్ధి జరిగితే చూపించి ఓట్లు అడగండి, కానీ మతకల్లోలాలు రేపే ప్రయత్నం చేయొద్దు” అని ఆయన బండి సంజయ్‌కు సవాలు విసిరారు.
జూబ్లీహిల్స్ ప్రాంతం సెక్యులర్ వాతావరణానికి ప్రతీక అని, ఇక్కడ హిందువులు, ముస్లింలు అన్నాతమ్ముల్లా కలిసి జీవిస్తున్నారని తెలిపారు. “రంజాన్, క్రిస్మస్, దసరా, బతుకమ్మ, సంక్రాంతి — అన్ని పండుగలను మేము కలసి జరుపుకుంటాం. ఇక్కడ కులమతాలకు స్థానం లేదు” అని నవీన్ యాదవ్ అన్నారు.
అలాగే బీఆర్‌ఎస్, బీజేపీ తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. “మమ్మల్ని రౌడీలు, గూండాలు అంటున్నారు; కానీ 40 ఏళ్లుగా మేము ఎప్పుడూ వసూళ్లకు పాల్పడలేదు. పేదోడు ప్రశాంతంగా ఉండటం మా ఆలోచన” అని స్పష్టం చేశారు.
తాను గెలిస్తే ప్రజలపై ఎలాంటి టాక్స్‌ల భారమూ ఉండదని హామీ ఇచ్చారు. చివరగా, జూబ్లీహిల్స్ ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది; ప్రయాణికులకు స్వల్ప గాయాలు ||A1TV TELUGU NEWS||
