రాజు వెడ్స్ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్ భార్య మౌనిక,టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తాజాగా విడుదలైన మిరాయ్ భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మనోజ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
తాజాగా మంచు మనోజ్ “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రంలోని పాటను ఆవిష్కరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు ఆయన భార్య భూమా మౌనికతో కలిసి విచ్చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్, “ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని తెలిపారు. అలాగే మౌనికపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ, “రాజ్యం లేకపోయినా రాణిలా చూసుకుంటానని మాటిచ్చాను” అని అన్నారు.
ఈ ఈవెంట్‌లో గాయకుడు మిట్టపల్లి సురేందర్ “రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా” అనే పాటను పాడగా, ఆ క్షణంలో మౌనిక భావోద్వేగానికి లోనై వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ సన్నివేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
