బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
తొలి దశలో ప్రముఖ నేతలు తమ ఓటు హక్కును వినియోగించారు. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) ఓటు వేయగా, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తన భార్యతో కలిసి హాజీపూర్‌లో ఓటు వేశారు.
ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా ఓటు వేశారు.
Also Read:పార్వతీపురం వద్ద ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం
మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబంతో పాట్నాలో ఓటు వేసి, ప్రజలను ఉపాధి, విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించి ఓటు వేయమని పిలుపునిచ్చారు. నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తొలి దశలో 121 స్థానాలకు, రెండో దశలో 122 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.
