ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబో నుంచి సెన్సేషన్‌ – “డ్రాగన్” సెట్ నుంచి కొత్త స్టిల్ వైరల్!

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో కొత్త స్టిల్ డ్రాగన్ మూవీ సెట్ నుంచి ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కొత్త ఫోటో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న *డ్రాగన్* సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. *కేజీఎఫ్*, *సలార్* వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఆయన డ్రీమ్ మూవీగా మారింది. అందుకే సినిమా ఓపెనింగ్‌ డే నుంచే అభిమానుల్లో భారీ హైప్‌ నెలకొంది.

ప్రశాంత్ నీల్ జెట్ స్పీడ్‌లో షూటింగ్‌ను పూర్తి చేస్తూ వస్తున్నా, ఇటీవల షూట్‌కు అనుకోకుండా విరామం రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ మరీ లీన్‌గా ఉందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

అయితే, మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ఒకే ఫోటోతో ఆ టెన్షన్‌కి చెక్ పెట్టేశారు. ఆ ఫొటోలో ప్రశాంత్ నీల్ స్వయంగా సెలూన్‌లో ఎన్టీఆర్‌కు స్టైలింగ్ చేస్తున్నాడు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, “పులి వేటకు సిద్ధమవుతోంది” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:బ్రహ్మోస్ ఒప్పందం దిశగా భారత్–ఇండోనేషియా


*డ్రాగన్* సినిమాను రెండు పార్ట్స్‌గా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. మొదటి పార్ట్‌కు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను ఈ నెల చివరి వారం లేదా డిసెంబర్‌ మొదటి వారంలో యూరప్‌లో జరపాలని యూనిట్ సిద్ధమవుతోంది. ఒకే ఫోటోతో మేకర్స్ ఫ్యాన్స్‌కు మళ్లీ హైప్‌ క్రియేట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *