IND vs SA 3rd ODI: ఇప్పటికే రెండో వన్డేలనే సిరీస్ సొంత అవుతుందన్న ఆశలు అడియాసలు అయ్యాయి. సౌత్ ఆఫ్రికా గట్టిగ పోటీనిచ్చి సిరీస్ లో సమఉజ్జిగా నిలిచాయి. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ చివరి దశకు చేరుకుంది.
ప్రస్తుతం సిరీస్లో నువ్వా – నేనా అనట్లుఉంది.అయితే ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండగా, డిసెంబర్ 6, 2025న విశాఖపట్నంలోని డాక్టర్ Y.S. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరగబోయే మూడో మ్యాచ్ విజేతను నిర్ణయించనుంది. వైజాగ్ గడ్డ సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక వేదికగా మారింది.
ALSO READ:400 IndiGo flights | ఇండిగో షాక్ ఒక్కరోజులో 400కి పైగా విమానాలు రద్దు
విశాఖపట్నం మైదానం ఎప్పుడూ టీమిండియాకు అనుకూలమైన గ్రౌండ్‌గా నిలిచింది. ఈ వేదికపై భారత్ ఇప్పటి వరకూ 10 వన్డే మ్యాచ్‌లు ఆడగా, ఎక్కువ సందర్భాల్లో విజయాలు సాధించింది. స్పిన్ మరియు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ భారత జట్టుకు ఎప్పుడూ అదనపు బలం అందించింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కి హోం అడ్వాంటేజ్ పెద్ద పాజిటివ్‌గా కనిపిస్తోంది.
సిరీస్ సమంలో కొనసాగుతున్న రెండు జట్లు ఫైనల్ పోరుకు బలమైన వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. భారత జట్టు గణాంకాలు, హోం కండిషన్స్, అభిమానుల మద్దతు వైజాగ్‌లో సానుకూల సమీకరణంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు దక్షిణాఫ్రికా కూడా కీలక మ్యాచ్‌ల్లో పెర్ఫార్మ్ చేయగల సత్తా ఉన్న జట్టుగా ప్రసిద్ధి. దీంతో ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారన్న ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.
మొత్తంగా, భారత జట్టు స్థానిక రికార్డులు బలంగా ఉండగా, దక్షిణాఫ్రికా సవాలు మ్యాచ్‌ను మరింత ఆసక్తికరం చేసేందుకు దోహదం చేస్తోంది. వైజాగ్ గడ్డపై తుది పోటీ సిరీస్‌ను ఎవరి వైపు తిప్పుతుందో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
