టాలీవుడ్‌లో వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ‘పూరి కనెక్ట్స్’ నిర్మించనుంది. షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి స్పందించారు. పూరి జగన్నాథ్ గత సినిమాలు ఫ్లాప్ అయినా, తాను ఎందుకు ఒప్పుకున్నారన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తాను ఎప్పుడూ డైరెక్టర్లను వారి గత విజయాలతో అంచనా వేయనని చెప్పారు. కథ నచ్చితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని పేర్కొన్నారు.
పూరి చెప్పిన కథ తనకు పూర్తిగా కొత్తగా అనిపించిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఇలాంటి కథను ఇప్పటివరకు తాను చేయలేదని అన్నారు. కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని, పాత ఫార్ములాలను పునరావృతం చేయనని పేర్కొన్నారు. పూరితో కలిసి చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్‌లో మొదలవుతుందని కూడా వెల్లడించారు.
ఇప్పటికే బాలీవుడ్ నటి టబు ఈ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించబోతున్నారని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. పూరి జగన్నాథ్‌కి ఇది మరో చాన్స్ అనే చెప్పవచ్చు. బ్లాక్‌బస్టర్‌లు ఇచ్చిన తరువాత వరుసగా ఎదురవుతున్న ఫ్లాపుల నుంచి గట్టెక్కే ప్రయత్నంగా ఈ చిత్రం మారనుంది.