వికటరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ కాంబోలో రూపొందుతున్న చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది, అలాగే చిత్రానికి సంబంధించిన తాజా వివరాలను విడుదల చేశారు.
ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌లో, “సంక్రాంతికి వస్తున్నాం” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్ సన్నివేశాలు, అలాగే అనిల్ ప్రత్యేకమైన కామెడీ టోన్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేష్ పంచ ఎగ్గట్టి అదరగొట్టగా, చుట్టు ఐశ్వర్యా రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కనిపిస్తున్నారు. వెంకటేష్ చేతిలో గన్ ఉంటే, ఇది చిత్రాన్ని మరింత థ్రిల్లింగ్‌గా చేయబోతుంది. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
