Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeTelanganaKTR | అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి.. వైద్యులకు కేటీఆర్ సూచన

KTR | అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి.. వైద్యులకు కేటీఆర్ సూచన

-

Chat on WhatsApp

KTR: అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ వైద్యులను ఆదేశించారు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్‌, హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల 16న తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ కాలనీలో పానీపూరి తిన్న పలువురు చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి చేరుకున్న కేటీఆర్‌, హరీశ్‌రావు చికిత్స పొందుతున్న చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కేటీఆర్‌, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అవసరమైతే అన్ని రకాల వైద్య సహాయం అందుబాటులో ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి వద్దకు చేరుకున్న పలువురు స్థానికులు, పార్టీ కార్యకర్తలు వారిని కలిసేందుకు ఆసక్తి చూపారు. అనంతరం సిరిసిల్లలో జరిగిన పలు కార్యక్రమాల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp