ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కబోతున్నట్టు సమాచారం. మొదట ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినా, చివరకు కార్పొరేషన్ చైర్మన్ పదవే సరైనదని పవన్ కల్యాణ్ భావించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలోనే నాగబాబును రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ కీలక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించనున్నారని సమాచారం. ఈ పదవి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే బాధ్యతలను ఆయన చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనే అవకాశముందని చెబుతున్నారు.
నాగబాబు రాజకీయంగా గత కొంతకాలంగా జనసేనకు మద్దతుగా ఉన్నా, ప్రత్యక్ష పదవిలో ఉండటం ఇదే మొదటిసారి. కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమైన తర్వాత రాష్ట్ర స్థాయిలో మరింత ప్రభావం చూపే విధంగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగనున్నట్టు తెలుస్తోంది. జనసేన క్యాడర్ కూడా ఈ నియామకంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. జనసేన శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. నాగబాబు తన కొత్త భాద్యతలను ఎలా నిర్వర్తిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.