జమ్మి చెట్టు నాటి పెంచండి, ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ లో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. గడిచిన 10 రోజులుగా విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు నాటి పెంచండి, పూజించండి అని ప్రచారం చేస్తూ వెయ్యి మొక్కలు పంపిణీ చేసామన్నారు. ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా నగరంలోని ప్రముఖ వ్యక్తులతొ జమ్మిచెట్టు మొక్కలు నాటించడం ఒక పనిగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ పెట్టుకుంటున్నారు. తులసి , ఉసిరి , మారేడు , వేప , మోదుగ, రావి , జమ్మి వంటి ఆయుర్వేద గుణాలు గల చెట్లని మనం దేవతా వృక్షాలుగా పూజిస్తామన్నారు. కానీ ఆయుర్వేద మందులలో పైన పేర్కొన్న మొక్కలు అన్ని ఉపకరిస్తాయని వివరించారు.
జమ్మి చెట్టు నాటి పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు
Green Climate Team's Javi Ratnam advocates planting Jammi trees for health and well-being during Vijayadashami celebrations, distributing 1,000 saplings.
