కోహ్లీని దాటేసిన వైభవ్ సూర్యవంశీ….2025లో భారత్‌లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్  

Vaibhav Suryavanshi most searched Indian cricketer 2025 Vaibhav Suryavanshi most searched Indian cricketer 2025

Google search trends: 2025లో భారత్‌లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) నిలవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్‌(IPL)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.

తొలి సీజన్‌లోని ఈ ప్రదర్శన అతన్ని దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చింది. 252 పరుగులతో సీజన్‌ను ముగించిన వైభవ్ గుజరాత్‌పై 101 పరుగుల ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ALSO READ:Woman bitten by snake | పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళకు పాము కాటు


ఐపీఎల్ తర్వాత అండర్-19, ఇండియా ఏ తరఫున ఆడుతూ ఇంగ్లండ్ టూర్‌లో 78 బంతుల్లో 143 పరుగులు చేయడం, ఆసియా కప్‌లో యూఏఈపై 32 బంతుల్లో సెంచరీ సాధించడం వైభవ్ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

ఈ ప్రదర్శనలతో వైభవ్ 2025 “ఇయర్ ఇన్ సెర్చ్”(Google Search trend) ప్రపంచ జాబితాలో ఆరో స్థానం, భారత్‌లో మొదటి స్థానాన్ని సాధించాడు. అతని తర్వాత అత్యధికంగా సెర్చ్ అయిన వారు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్షు ఆర్య, టీ20 ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *