Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeNationalCM Vijay | టీవీకే గుర్తుండేలా పేరు.. చంటిబిడ్డకు నామకరణం చేసిన విజయ్

CM Vijay | టీవీకే గుర్తుండేలా పేరు.. చంటిబిడ్డకు నామకరణం చేసిన విజయ్

-

Chat on WhatsApp

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో అరుదైన సంఘటన ఒకటి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఓ ఎమ్మెల్యే చిన్నారికి స్వయంగా పేరు పెట్టడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శాసనసభ సమావేశాల అనంతరం సచివాలయం నుంచి బయలుదేరుతున్న ముఖ్యమంత్రి విజయ్‌ను తిరు.వి.క.నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లవి ప్రత్యేకంగా కలిశారు.

తన చిన్నారిని వెంట తీసుకువచ్చిన ఆమె, ముందుగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన చిన్నారికి పేరు పెట్టే బాధ్యతను ముఖ్యమంత్రికి అప్పగించారు. ఎమ్మెల్యే అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించిన విజయ్, పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఆశీర్వదించారు. ఆ తర్వాత ‘తమిళ్ వెట్రి కొండాన్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ పేరు వెనుక ప్రత్యేకత కూడా ఉందని ఎమ్మెల్యే పల్లవి వివరించారు. విజయ్ నటించిన ప్రముఖ చిత్రం ‘జననాయగన్’లో ఆయన పాత్ర పేరు ‘వెట్రి కొండాన్’ కాగా, దానికి ‘తమిళ్’ అనే పదాన్ని జోడించి ముఖ్యమంత్రి పేరు సూచించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పల్లవి, తన బిడ్డకు విజయ్ చేతుల మీదుగా నామకరణం జరగడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జన్మించిన తన కుమారుడికి పార్టీకి సంబంధించిన గుర్తింపు ఉండేలా పేరు పెడతానని గతంలోనే నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ సంఘటన రాజకీయ అభిమానుల్లో ప్రత్యేక చర్చకు దారితీయగా, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp