అంబేద్కర్ పై వ్యాఖ్యలపై అమిత్ షా బర్తరఫ్ డిమాండ్
మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి (KLR) మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించడం అమిత్ షా అహంకారానికి…
