arrested a gas delivery boy in Kukatpally and seized 580 grams of ganja

Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

HYDERABAD: కూకట్‌పల్లిలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌(gas delivery boy)గా పనిచేస్తున్న గాదె అజయ్‌ (21) గంజాయి సరఫరా వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారుల దృష్టికి చిక్కాడు. ఇంటింటికీ సిలిండర్లు అందిస్తూ వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో అదనపు సంపాదన కోసం అక్రమంగా గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. గంజాయి తీసుకునే వారు ఆర్డర్‌ ఇస్తే నేరుగా వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తున్నాడు. ఇస్తావా హోమ్స్‌ ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది నిఘా పెట్టి…

Read More
Hyderabad cyber fraud case involving a dentist losing 14 crore through a Facebook crypto scam

Hyderabad Cyber Scam | డెంటల్ డాక్టర్‌ను టార్గెట్ చేసిన సైబర్ గ్యాంగ్…14 కోట్లు మాయం

Hyderabad Cyber Scam: హైదరాబాద్‌లో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. హబ్సిగూడకు చెందిన ఓ డెంటల్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు 14 కోట్ల రూపాయల మేరకు మోసగించారు. సంప్రదాయ దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోతున్న వేళ సైబర్ మోసాలు మాత్రం భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజర్‌లో “మౌనిక” అనే పేరుతో ఓ మహిళ డాక్టర్‌ను సంప్రదించింది. తాను కష్టాల్లో ఉన్నానని భావోద్వేగ పూరిత సందేశాలతో…

Read More
KCR during the 2009 indefinite hunger strike for Telangana statehood

Telangana Movement History | కేసీఆర్ ఆమరణ దీక్ష నేటికీ 16 ఏళ్లు…దాస్య శృంఖలాలు తెంచి

Telangana Movement History: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ఆయన కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా రంగధాంపల్లి ప్రాంతానికి బయలుదేరి దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి పోలీసులు ఆయనను అక్కడికే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ALSO READ:iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ…

Read More
iBomma Ravi in police custody during piracy investigation

iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

iBomma Ravi: పైరసీ సినిమాల కేసులో అరెస్టైన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు  I Bomma Ravi విచారణలో అనేక కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. రెండో రోజు విచారణలో మధ్యాహ్నం తర్వాత రవి నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ పౌరసత్వం ఉన్న కారణంగా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించానని రవి అంగీకరించినట్లు తెలిసింది.గత ఆరేళ్లుగా ఎవరూ తనను పట్టుకోలేకపోవడం వల్ల ధైర్యం పెరిగి, దేశ, విదేశాల్లో తన పైరసీ నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు రవి చెప్పినట్టు సమాచారం….

Read More
Hong Kong skyscraper fire incident compared with Hyderabad high-rise safety concerns

హాంకాంగ్ స్కై స్క్రాపర్ ఫైర్ | Hyderabad High-rise Safety Analysis

Hong Kong skyscraper fire incident: అగ్నిప్రమాదాలు కాంక్రీట్ జంగిల్స్‌లో జరగవని అనుకునే అభిప్రాయం తాజాగా మారిపోయింది. హాంకాంగ్‌లోని ఓ కమ్యూనిటీలో ఎనిమిది స్కై స్క్రాపర్ అపార్టుమెంట్లు ఉండగా, ఒక్క ఫ్లాట్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే ఇతర టవర్లకు వ్యాపించి భారీ నష్టం కలిగించాయి. ప్రాణనష్టం ఎంత జరిగిందన్నది ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. ఈ దృశ్యాలు ఆకాశహర్మ్యాల్లో నివసించే ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో హై-రైజ్ నిర్మాణాల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. 30 అంతస్తుల భవనాలు…

Read More
Manchireddy Kishan Reddy speaking on Rangareddy district merger issues

రంగారెడ్డి జిల్లాను GHMCలో విలీనం చేస్తారా?: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.రంగారెడ్డి జిల్లాను అంతరించేలాగా, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రయత్నించడం సరికాదని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నాయకులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన కుటిల బుద్ధిని బయటపెడుతున్నాయని అన్నారు. ALSO READ:Telangana government | భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం “ఫ్యూచర్ సిటీ పేరుతో 56 గ్రామాలు నాశనమయ్యాయి. రియల్…

Read More
Telangana government publishes prohibited lands list to prevent illegal registrations

Telangana government | భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana land registration: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూముల అక్రమ క్రయ విక్రయాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22(ఏ) కింద రూపొందించిన “నిషేధిత భూముల జాబితాను” ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు జాబితాలను సిద్ధం చేశారు. ఆ జాబితాలో మొదట తప్పుడు వివరాలు ఉండటంతో సవరణలు చేసిన తర్వాత, “తుది జాబితాను పబ్లిక్…

Read More