పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి
Indiramma Housing Scheme: ఇండ్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం బైంసా మండలం ఎగ్గాం గ్రామంలో కండేక కవిత, ధర్మపాల్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఒకదాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా…
