కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం మూడురోజులపాటు అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో లలిత కళలకు ప్రాధాన్యం ఇవ్వబడింది.

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం

ఖైరతాబాద్ ఏ వన్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం నిర్వహించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత రఘురాం, జనరల్ సెక్రటరీ కామేశ్వరరావు కందర్ప ఈ వేడుకలను మూడురోజుల కన్నుల పండుగగా నిర్వహించాలని తెలిపారు. ప్రముఖ నటుడు సుమన్ ఈ నెల 20న ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. లలిత కళలకు ప్రాధాన్యత కల్పించే ఈ ఆడిటోరియంలో ప్రజలకు సౌకర్యవంతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు…

Read More
బర్కత్‌పురాలోని శ్రీమతి ఎ. శ్యామలా దేవి డిగ్రీ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కళాశాల విద్యార్థుల కళా ప్రదర్శన

హైదరాబాద్ బర్కత్‌పురాలోని శ్రీమతి ఎ. శ్యామలా దేవి డిగ్రీ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను శుభారంభం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.వేడుకలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకోవడంతో వేడుకలకు ప్రత్యేక శోభ వచ్చిందని గవర్నర్ ప్రశంసించారు. ఈ కళాశాల 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని…

Read More
డాక్టర్ కమల్ సోయి, చైనీస్ చిప్స్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని ఆరోపించారు. Telangana రవాణా శాఖ స్మార్ట్ కార్డుల్లో నాసిరకం చిప్స్ వాడుతున్నదని, ఇది వినియోగదారుల గోప్యతను ప్రమాదంలో పడేస్తుందని అన్నారు.

నాసిరకం చైనీస్ చిప్స్‌తో జాతీయ భద్రతకు ముప్పు

రాహత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి, చైనీస్ చిప్స్ వాడకం వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని విమర్శించారు. సోమాజిగూడ మెల్కురి హోటల్లో ప్రెస్ మీట్‌లో, స్మార్ట్ కార్డుల్లో నాసిరకం చిప్స్ వాడుతున్నారని, Telangana రవాణా శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ చిప్స్ హ్యాకింగ్, డేటా లీక్‌కు అవకాశం కల్పిస్తాయని, వినియోగదారుల గోప్యత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. Telangana రవాణా శాఖ 2023లో కలర్స్ ప్లాస్టిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు స్మార్ట్…

Read More
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు విద్యార్థినిని హోటల్‌లో నిర్బంధించి అఘాయిత్యం. షీ టీమ్స్ స్పందించి బాధితురాలిని రక్షించారు.

హోటల్‌లో 20 రోజులపాటు విద్యార్థిపై అఘాయిత్యం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు. అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్…

Read More
పెళ్లి నిరాకరణతో హైదరాబాద్‌ లో యువకుడు స్నేహితురాలిని కత్తితో చంపి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి నిరాకరణతో కత్తితో దాడి, ఆత్మహత్యకు యత్నం

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఏడాదిగా వెంటపడుతున్నా పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. స్నేహితురాలిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అడ్డొచ్చిన ఆమె స్నేహితురాళ్లపైనా దాడి చేశాడు. ఆపై అక్కడి నుంచి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ నల్లగండ్లలో బ్యుటీషియన్ గా పనిచేస్తోంది. గోపన్ పల్లి తండా…

Read More

హైడ్రా అక్రమ నిర్మాణదారులపై కొత్త షాక్

హైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రా.. తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చు మొత్తం వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి బుల్డోజర్లు, వాటికి ఇంధనం, ఆపరేటర్ కు వేతనం, కూల్చివేతల తర్వాత పోగవుతున్న వ్యర్థాల తరలింపు.. వీటికయ్యే ఖర్చు మొత్తం అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తేల్చిచెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ…

Read More

మహిళల ఉచిత రవాణా ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల వివరణ

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. రాత్రివేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి వాటితో కొందరు నెటిజన్లు తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. 1091, 78370 18555 నెంబర్లకు ఫోన్ చేస్తే స్థానిక పోలీసు వాహనం వచ్చి మహిళలను ఇంటి…

Read More