సకినాపూర్‌లో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం
అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, గుట్కా, మద్యపాన నివారణపై పోలీసు కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాబృందం పాటలు పాడి, నాటికలు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదిలాబాద్ రూరల్ సీఐ ఫణిందర్ మాట్లాడుతూ, మూఢనమ్మకాల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ నివారణ చర్యలు తీసుకోవాలని, యువత…
