రైతుల కేక – ‘మా పంటల్ని కొనండి’ అంటూ రోడ్డుపై ధర్నా
అదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం నేరడిగొండలో రైతులు జాతీయ రహదారిపై భారీ ధర్నా, రాస్తారోకో చేపట్టారు.మా పంటల్ని కొనండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు రహదారిపై బైఠాయించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి తేమశాతాన్ని ప్రస్తుత 12% నుండి 20%కు పెంచాలని, పత్తి పంటను ఎకరానికి కనీసం 12 క్వింటాళ్లు, సోయా పంటను ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు….
