రాజధాని మోసంపై మోదీ-బాబు వైఖరిపై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కేంద్రం పాత్ర, నిధుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు. విభజన చట్టం 94(3) ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదని గుర్తుచేస్తూ, మోదీ తన హామీలను నిలబెట్టుకోలేదని ఆమె ఆరోపించారు. “2015లో మట్టి కొట్టి, ఇప్పుడు మాటలు కొడుతున్నారు” అంటూ షర్మిల మండిపడ్డారు. అప్పట్లో అద్భుత అభివృద్ధి చేస్తామన్న మాటలు అన్నీ వదంతులే అయిపోయాయని,…
