ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 : సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై రాజకీయ కసరత్తులు
ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కుతోంది. ఈ పదవికి ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారవడంతో దక్షిణ భారత రాజకీయాల్లో విస్తృత చర్చలు మొదలయ్యాయి. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకుడు కావడం, ఆయనకు ఆరెస్సెస్ మద్దతు ఉండటం, అలాగే 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు అధికార పార్టీ…
