భారతీయ సంప్రదాయంలో ఉక్రెయిన్ జంట వివాహం!
భారతీయ సంప్రదాయాలకు ముగ్ధులైన ఓ ఉక్రెయిన్ జంట జోధ్‌పూర్‌లో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. స్టానిస్టేవ్(72) మరియు అన్‌హెలీనా(27) ఈ జంట నాలుగేళ్లుగా ప్రేమలో ఉండి, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు భారతీయ సంస్కృతిని ఎంతో ఇష్టపడ్డారు. అందువలన హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం జరగాలని నిర్ణయించుకున్నారు. వారిని అందుకు అనుకూలంగా ఏర్పాటు చేసే సంస్థను సంప్రదించారు. సంస్థ నిర్వాహకులు రోహిత్, దీపక్ జంటకు వివాహం గురించి వివరంగా వీడియోలు పంపించారు. ఆ వీడియోల ఆధారంగా,…
