‘శివ’ నా ఆలోచన విధానాన్ని మార్చేసిన సినిమా – శేఖర్ కమ్ముల భావోద్వేగ వ్యాఖ్య

తెలుగు సినిమా చరిత్రలో ఓ మలుపు తిప్పిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త శకం తెచ్చింది. ఇప్పుడు అదే సినిమా మళ్లీ పెద్ద తెరపైకి రానుండగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన భావోద్వేగాలను పంచుకున్నారు. “‘శివ’ నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా” అంటూ ఆయన వెల్లడించిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నవంబర్…

Read More

‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ దుమారం – 9 రోజుల్లో రూ.509 కోట్ల వసూళ్లు

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రికార్డులు తిరగరాస్తోంది. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుండి అప్రతిహతమైన స్పందనను పొందుతూ దుమ్మురేపుతోంది. తాజాగా విడుదలైన అప్‌డేట్ ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది….

Read More

రాజమౌళి పుట్టినరోజు సందడి – మహేశ్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు, అభిమానుల్లో ఉత్సాహం

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నేడు తన 52వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తెలుగు సినిమా గర్వకారణంగా, భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబు కూడా రాజమౌళికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “ఒకే ఒక్కడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్తులో అన్నీ ఉత్తమంగానే జరగాలని ఆశిస్తున్నాను. అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోండి…

Read More

దీపికా పదుకొణే షాకింగ్ నిర్ణయం – ‘స్పిరిట్’, ‘కల్కి 2’ నుంచి తప్పుకున్న కారణం ఇదే!

బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణే తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులు — “స్పిరిట్” మరియు “కల్కి 2898 ఏడీ 2” సీక్వెల్‌ల నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. దీపికా ఈ నిర్ణయానికి వెనుక ఉన్న అసలు కారణం ఆమె తాజా వ్యాఖ్యల ద్వారానే బయటపడింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు రోజుకు కేవలం 8…

Read More

రమ్యపై ట్రోలింగ్ కేసులో 12 మంది దర్శన్ అభిమానులపై ఛార్జ్‌షీట్!

కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ రమ్యపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో కర్ణాటక పోలీసులు కీలక ముందడుగు వేశారు. నటుడు దర్శన్ అభిమానులుగా గుర్తించిన 12 మందిపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) గురువారం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. బెంగళూరు 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టుకు 380 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను సమర్పించారు. ఈ ఘటనకు మూలం దర్శన్ అభిమాని హత్య కేసు. ఆ ఘటనపై…

Read More

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి పూణెలో.. రామ్‌చరణ్–జాన్వీ జోడి అదరగొట్టనుంది!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి అభిమానుల్లో ఉత్సాహం రేపే అప్‌డేట్ వచ్చింది. రేపటి నుంచి పూణెలో ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్‌ చిత్రీకరణ మొదలుకానుంది. ఈ పాటలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్టెప్పులేయనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి…

Read More

గ్లామర్‌తో మళ్లీ పుంజుకున్న త్రిష.. ‘విశ్వంభర’, ‘కరుప్పు’పై హై హోప్స్!

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి త్రిష, ప్రస్తుతం మరోసారి కెరియర్ పరంగా పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఈ బ్యూటీ, ఇటీవల కొంత కాలం అవకాశాలు తగ్గడంతో నాయికా ప్రధాన పాత్రల్లో కనిపించింది. ‘రాంగీ’, ‘ది రోడ్’, ‘96’ వంటి సినిమాలు ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో త్రిష మరింత…

Read More