పహల్గామ్ దాడిపై పిల్ తిరస్కరణ చేసిన సుప్రీం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు అపరిపక్వంగా కాకుండా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. “దేశం ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవాలి. మీ చర్యల ద్వారా భద్రతా బలగాల…
