వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య డిమాండ్
విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. వైసీపీ(ysrcp) అధినేత జగన్ ఆదేశాల మేరకు బొత్స అప్పలనరసయ్య నేతృత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్…
