RFCL మజ్దూర్ యూనియన్ నాయకుడు అంబటి నరేష్ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మెకు BRS కార్మిక నేత కౌశిక్ హరి మద్దతు ప్రకటించారు. RFCL యాజమాన్యం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. యూరియా ఉత్పత్తికి కీలకం అయిన కార్మికులను విస్మరించడం అన్యాయమని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను కాపాడేందుకు బలమైన పోరాటం అవసరమని కౌశిక్ హరి స్పష్టం చేశారు. బీహారి హటావో నినాదాలతో కార్మికుల ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. RFCL యాజమాన్యం తక్షణమే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో, మార్చ్ 6న హైద్రాబాద్‌లోని RLC కార్యాలయంలో కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు సఫలం కాకుంటే, కార్మికుల హక్కుల కోసం చట్టబద్ధ సమ్మెకు వెనుకాడబోయేది లేదని కార్మిక నాయకులు తేల్చిచెప్పారు. RFCL యాజమాన్యం తన వైఖరిలో మార్పు తేవాలని, లేకపోతే కార్మికులు మరింత తీవ్రంగా ఆందోళన చేపడతారని హెచ్చరించారు.
కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదని, సమ్మెకు దారి తీసే విధంగా వ్యవహరించొద్దని కార్మిక సంఘాల నేతలు సూచించారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, వారి హక్కుల కోసం ఎలాంటి సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు.