ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం 10:50 గంటలకు సత్య సాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
ALSO READ:ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం
అక్కడి నుంచి కాన్వాయ్‌తో హిల్ వ్యూ స్టేడియంకు వెళ్లి శత జయంతి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
సత్యసాయి జిల్లాలో ముఖ్య సమావేశాలు, భక్తుల సమాగమం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ శత జయంతి వేడుకలు నిర్వహించబడుతున్నాయి.
