Telangana Startup Fund: స్టార్టప్స్ కోసం ₹1000Cr ఫండ్ ఏర్పాటు  

Telangana IT Special CS Sanjay Kumar announces ₹1000 crore startup fund Telangana IT Special CS Sanjay Kumar announces ₹1000 crore startup fund

తెలంగాణలో స్టార్టప్(Telangana Startup) ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్టప్స్ కోసం ₹1000 కోట్లు విడుదలచేసే ప్రత్యేక ఫండ్‌ను(1000 Crore Fund) ఏర్పాటు చేస్తున్నట్లు IT డిపార్ట్మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు.

ఈ ఫండ్‌ను వచ్చే జనవరిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కొత్తగా వచ్చే ఇన్నోవేటివ్ స్టార్టప్స్‌కు పెట్టుబడుల సమస్యను పరిష్కరించడానికి ఇది పెద్ద సహకారంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ALSO READ:పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం

ప్రత్యేకంగా AI ఆధారిత స్టార్టప్స్‌పై ఈ ఫండ్ దృష్టి సారించనుందని చెప్పారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంజయ్ కుమార్ స్పష్టంచేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో రాష్ట్రం మరింత ముందంజలో నిలిచేలా ఈ ఫండ్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *