‘మోగ్లీ 2025’ సయ్యారే సాంగ్ లాంచ్ – రోషన్ కనకాల సెకండ్ మూవీకి అద్భుత స్పందన!


యంగ్ హీరో రోషన్ కనకాల ‘బబుల్ గమ్’తో చేసిన సక్సెస్ ఫుల్ డెబ్యూ తర్వాత, తన రెండో చిత్రంగా ‘మోగ్లీ 2025’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భవ్యంగా నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలోని యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో అద్భుత స్పందన పొందింది.

మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ **‘సయ్యారే’**ను విడుదల చేస్తూ మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. కాల భైరవ అందమైన ఆర్కెస్ట్రేషన్‌తో మధురమైన ట్యూన్ కంపోజ్ చేయగా, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ రాశారు. ఈ పాట చెవిటి, మూగ అమ్మాయి, సౌండ్ నిరోధించే డివైజ్ ధరించి తన వినికిడి త్యాగం చేసే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. అతను ఆమెకు రాసే లేఖ ద్వారా భావోద్వేగ ప్రేమను వ్యక్తం చేస్తాడు.

పాటలో కాల భైరవ స్వయంగా ఐశ్వర్య దారురితో కలిసి ఆత్మీయంగా ఆలపించారు. రోషన్ కనకాల మెచ్యూర్ నటన, సాక్షి మడోల్కర్‌తో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, సోల్‌ఫుల్ వోకల్స్‌తో ఈ పాట సినిమా మ్యూజిక్ జర్నీకి పర్ఫెక్ట్ స్టార్ట్ గా నిలిచింది.

ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా, హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని రామ మారుతి ఎం, ఎడిటింగ్‌ను కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్షన్‌ను కిరణ్ మామిడి, యాక్షన్ కొరియోగ్రఫీని నటరాజ్ మాదిగొండ అందిస్తున్నారు. ‘మోగ్లీ 2025’ డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఎంఎం కీరవాణి మాట్లాడుతూ, “కలర్ ఫోటో తర్వాత వచ్చిన నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చబోతున్న సందీప్ రాజ్‌కి శుభాకాంక్షలు. విశ్వ ప్రసాద్ నా చిరకాల మిత్రుడు. కాల భైరవ ఈ పాటతో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడు. సయ్యారే సాంగ్ చాలా బాగుంది” అన్నారు.

నిర్మాత టిజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, “రోషన్ మొదటి సినిమా ‘బబుల్ గమ్’ మేమే ప్రజెంట్ చేశాం. అప్పుడు నుంచే అతనితో మరో పెద్ద ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే లవ్ స్టోరీ. కంట్రోల్ బడ్జెట్‌లో భారీ స్పాన్‌తో తీసిన సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది” అన్నారు.

హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ, “మా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కీరవాణి గారికి కృతజ్ఞతలు. కాల భైరవ ఈ పాటను ఎంతో ప్రేమతో చేశాడు. చంద్రబోస్ లిరిక్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. సందీప్ గారు సినిమాను అద్భుతంగా తీశారు. డిసెంబర్ 12న విడుదల కానున్న మా సినిమాను మీరు ప్రేమిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, “ఐదేళ్ల తర్వాత దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ కలిగిన సినిమా. విశ్వప్రసాద్ గారు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఇది సాధ్యమైంది. రోషన్, సాక్షి అద్భుతంగా నటించారు. పాట నచ్చితే సినిమా మరింతగా నచ్చుతుంది” అన్నారు.

కాల భైరవ మాట్లాడుతూ, “సందీప్ గారితో ‘కలర్ ఫోటో’, విశ్వప్రసాద్ గారితో ‘కార్తికేయ 2’ చేశాను. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సయ్యారే పాట మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

నిర్మాత కృతి ప్రసాద్ మాట్లాడుతూ, “సయ్యారే నా ఫేవరెట్ సాంగ్. కాల భైరవ అద్భుతంగా కంపోజ్ చేశారు. రోషన్, సాక్షి నటన హైలైట్. మా టీమ్‌కు ధన్యవాదాలు” అన్నారు.

‘మోగ్లీ 2025’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌తో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రేమ, ప్రకృతి, త్యాగం నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఏడాది చివరి పెద్ద ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *