భద్రాచలం సలీం టీ స్టాల్ ముందు 6 అంతస్తుల భవనం ఆకస్మికంగా కుప్పకూలిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భవనం కింద 6 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అదనంగా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయిన అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీములు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన భద్రాచలం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవనం పాతదేనా? లేదా నిర్మాణంలో లోపాల వల్ల కూలిపోయిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలకు సహకరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో…
