Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeKarimnagarHuzurabadజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

-

Chat on WhatsApp

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్(Jubilee Hills Election) సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన హల్‌చల్ సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల సూచనలను పట్టించుకోకుండా తన అనుచరులతో కలిసి కేంద్రంలోకి చొరబడటానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు.

ALSO READ:YS Jagan CBI Court:ఈ నెల 21లోగా సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్
ఎన్నికల కోడ్ ప్రకారం అనుమతి లేకుండా లోనికి ప్రవేశించరాదని చెప్పినా, ఆయన సిబ్బందిని తోసుకుని లోపలికి వెళ్లినట్లు మధురానగర్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై పోలీసులు కౌశిక్‌రెడ్డిపై అక్రమ చొరబాటు (ట్రెస్పాస్) మరియు పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేశారు.
పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, కొన్నిచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

కౌశిక్‌రెడ్డి చర్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp