చికెన్‌కు మించిన ప్రోటీన్…

చికెన్‌కు మించిన ప్రోటీన్ ఎండు చేపలు, ట్యూనాలో ఆకట్టుకునే పోషక విలువలు

ప్రోటీన్ కోసం చికెన్‌ అన్నదే సాధారణంగా మనకు గుర్తుకొచ్చే ఎంపిక. కానీ ఇప్పుడు గ్రిల్డ్ చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎండు చేపలు (Dry Fish) వాటిలో ముందుంటాయి. తాజా గణాంకాల ప్రకారం, 100 గ్రాముల ఎండు చేపల్లో సుమారు 60 గ్రాముల ప్రోటీన్ లభిస్తోంది. ఇది చికెన్‌లో లభించే ప్రోటీన్‌ కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. అంతేకాదు, పర్మేసన్ చీజ్ (Parmesan Cheese), ట్యూనా చేపలు (Tuna Fish) వంటి ఆహార పదార్థాల్లోనూ అధికంగా ప్రోటీన్‌ లభిస్తోంది. ఈ వివరాలు అమెరికా వ్యవసాయ శాఖ (USDA) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయ్యాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలనుకునే వారికి ఇవి గొప్ప ఎంపికలుగా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *