ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిలై ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.వెంకట్‌కు కిడ్నీ మార్పిడి అవసరం, ఖర్చు భారీగా ఉంటుందని ఆయన భార్య సువర్ణ తెలిపారు. కాగా, ప్రభాస్ రూ.50 లక్షలు సాయం చేశారన్న వార్తలు నిరాకరించారు. కిడ్నీ మార్పిడికి దాతలు, మానవతావాదులు ముందుకు రావాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కమెడియన్ ఫిష్ వెంకట్
