మనోవికాసం లోక్ కళాకార్ దివస్ సందర్భంగా మార్చి 11, 12, 13 తేదీలలో చీరాల నియోజకవర్గంలో బాలల నైపుణ్యాల వర్క్ షాప్ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ORS) లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, చేతివ్రాత, ఏకపాత్రాభినయం వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించగా, మొత్తం 8 పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
ఏకపాత్రాభినయ పోటీలలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన బొడ్డు సంకేత్ కుమార్ (ORS స్కూల్, 5వ తరగతి) ప్రథమ స్థానం సాధించాడు. ద్వితీయ స్థానాన్ని MPP స్కూల్ (వూటుకూరి సుబ్బయ్య పాలెం) కు చెందిన మోహన్ (5వ తరగతి) గెలుచుకున్నాడు. ప్రత్యేక బహుమతిగా కె.మన్విత, బి.శ్రీఖ (ORS స్కూల్, 5వ తరగతి) ఎంపికయ్యారు. మొత్తం 14 మంది చిన్నారులు పోటీలో అద్భుత ప్రదర్శన చేశారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారులు J.V. సుబ్బయ్య, ఐ. పురుషోత్తం హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, వారు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. చిన్నారుల నైపుణ్యాలను వెలికితీయడంలో ఈ పోటీలు ఎంతో ఉపయోగపడినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా M.P.P.S (ORS) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు B. మంజులాదేవి, ఉపాధ్యాయులు కోడె శ్రీనివాసరావు, ఆశ్రమ పాఠశాల HM యాపిల్ గ్రేస్, M.P.P.S దేశాయిపేట HM కె. మల్లీశ్వరి, శివకుమారి, డి. సరళ, జి. వెంకటేశ్వర్లు, బి. వెంటేశ్వర్లు, బి. పద్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా సహాయపడ్డారు.