ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లకు కీలక సమాచారం! ఆగస్టు 11, 2025 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు చాలామంది వినియోగదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనీస చెల్లింపు మొత్తం (Minimum Due) పెరగనుంది. ఇది వినియోగదారుల నెలవారీ చెల్లింపులపై భారం కలిగించవచ్చు. బిల్లు చెల్లింపుల సర్దుబాటు విధానం (Payment Allocation) మారనుంది. అంటే మీరు చెల్లించిన మొత్తం మొదట ఏ రకమైన లావాదేవీలకు అన్వయించబడుతుందో దాని విధానం మార్చబడుతుంది. ఎంపిక చేసిన కార్డులపై అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ బీమా (Air Accident Insurance) ని రద్దు చేయనున్నారు. దీనిని ఆగస్టు 11 నుంచి నిలిపివేస్తామని అధికారికంగా ఎస్‌బీఐ కార్డ్స్ ప్రకటించింది. కాబట్టి వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ మార్పులు ఖర్చు, EMI, చెల్లింపు పద్ధతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు
