చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ, వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక లేదా మట్టిని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాల్టా చట్టం ప్రకారం అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, శిక్షలు విధించబడతాయని తెలిపారు.
ఖాజాపూర్ గ్రామానికి చెందిన జీవన్ అనే వ్యక్తి టిప్పర్ ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించామని, వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు సంబంధిత చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రకృతి వనరులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదేనని, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని ఎస్సై నారాయణ గౌడ్ హెచ్చరించారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.