నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ సోకిన 8 సంవత్సరాల బాలుడు, ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
వైరస్ నిర్ధారణ తరువాత, బాలుడిని పరిస్థితి మరింత తీవ్రంగా మారినట్లయితే చెన్నైలోని ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం పై వైద్యులు గమనిస్తున్నారనీ, సంబంధిత చికిత్స జరుగుతోందని వెల్లడించారు.
ఇతర గ్రామాలలో కూడా జికా వైరస్ పుట్టుక పై అవగాహన పెంచేందుకు మరియు ఇతర చర్యలను తీసుకోవడానికి, నేడు రాష్ట్ర వైద్యుల బృందం వెంకటాపురం గ్రామాన్ని పర్యటించనుంది.
జికా వైరస్ కారణంగా స్థానికులు అప్రమత్తమవడం ప్రారంభించారు. వైద్యులు, గ్రామస్తులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, తద్వారా వైరస్ నివారణలో సహకరించవచ్చని తెలిపారు.