బొబ్బిలిలో జనసేన పార్టీలో చేరిన యువత నాయకులు

Youth Leaders Join Jana Sena Party in Bobbili

బొబ్బిలి మండలం వైసిపి యూత్ విభాగం కన్వీనర్ నేమాపు వెంకటేష్ మరియు సీతయ్యపేట గ్రామం వైస్ సర్పంచ్ నేమాపు భాను ,తమ 50 మంది ముఖ్య అనుచరులతో ఈరోజు బొబ్బిలి జనసైనికుల నిలయంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ మరియు తీయల జగదీష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు వా రి చేతుల మీదుగా జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల అధ్యక్షులు .బవిరెడ్డి మహేష్, వీరమహిళలు గైనేడి రమ్య, భద్రగిరి సత్య,‌ నాయకులు గేదెల శరత్, కలిశెట్టి ప్రశాంత్, రేవెళ్ల కిరణ్, వెలగ శ్రీను, దిబ్బ కళ్యాణ్, చింతాడ అనంత్, పోతల శివశంకర్, పిల్లా తిరుపతి, పిల్లా సతీష్, కింతలవానిపేట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *