గద్వాల జిల్లా మానవపాడు తహశీల్దార్ వహీదా ఖాతున్ను ఓ యువతి నిలదీసింది. నారాయణపురం గ్రామానికి చెందిన హైమావతి ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోగా. పది రోజులైనా సర్టిఫికెట్ జారీ చేయకపోగా ఉదయం వెళ్లి అడిగిన కూడా జాప్యం చేస్తూ గంటలు గంటలు పాటు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సర్టిఫికెట్లతో అవసరం ఉండి మేము అప్లై చేశాము ఇంటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని బైఠాయించింది. దీంతో తహశీల్దార్ యువతిని సముదాయించి సర్టిఫికెట్లను జారీ చేసింది.
యువతి నిరసనతో తహశీల్దార్ సర్టిఫికేట్లు జారీ
 
				
			
 
				
			 
				
			