అమరావతి తెలంగాణను దాటుతుందా? కేటీఆర్ సమాధానం

KTR addressed a question about Amaravati potentially surpassing Hyderabad, highlighting Telangana's growth and his predictions for the future. KTR addressed a question about Amaravati potentially surpassing Hyderabad, highlighting Telangana's growth and his predictions for the future.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అమరావతి దాటిస్తుందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నిన్న సాయంత్రం ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా, ఒక నెటిజన్.. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి తెలంగాణ రాజధానిని దాటేస్తుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు.

కేటీఆర్, చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న నాయకుడని, కానీ హైదరాబాద్ తాను అభివృద్ధి చెందింది అని అన్నారు. గతంతో పోలిస్తే, ఐటీలో బెంగళూరును కూడా దాటించారన్నారు. ఈ సందర్భంగా, కేటీఆర్ ప్రస్తుత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, వారి పాలనలో ఏం జరుగుతుందో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు.

అలాగే, తమిళనాడులో పార్టీని స్థాపించిన హీరో విజయ్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2028లో మళ్లీ మంత్రిగా కనిపించే అవకాశం ఉందని ఆయన భావించారు. మహారాష్ట్రలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలు నమ్మడం లేదని, అందుకని అక్కడ స్థానిక పార్టీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని కేటీఆర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *