8ఇంక్లైన్ కాలనీలోని హనుమాన్ నగర్ కు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు.
గోదావరిఖనికి చెందిన వివాహితతో ప్రేమ వ్యవహారమే వినయ్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది, వినయ్ కుమార్ గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో స్కావేంజర్ గా పనిచేస్తున్నాడు.
గోదావరిఖనికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో కొంతకాలంగా మృతుడు ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు..ఈ క్రమం లో సదరు వివాహితను మూడు నెలల క్రితం వినయ్ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు వివాహాన్ని అంగీకరించక పోవడంతో స్థానిక 8 ఇంక్లైన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించ డంతో ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన ఇద్దరిలో మార్పు రాకపోవడంతో…
ఈ క్రమంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం సాయంత్రం 8 ఇంక్లైన్ కాలనీకి మృతుడు వినయ్ కుమార్ వెళ్లాడు. పక్కా పథకం ప్రకారం సదరు వివాహిత భర్త తమ్ముడు కలిసి హత్య చేశారు.
సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపు తున్నట్లు పోలీసులు తెలిపారు.